Afghanistan Vs Bangladesh: ఆఫ్ఘన్ ఆటకు బంగ్లా బెంబేలు రెండు సెంచురీలతో చితకొట్టారు

ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 01:15 PM IST

ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడి భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ 21 ఏళ్ల యువకులిద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లను భీకరంగా చిత్తు చేసి పరుగులు రాబట్టారు. ఈ ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లు ఇద్దరు తమ జట్టులో ఎన్నో రికార్డులు సృష్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఇంతకు ముందు ఈ రికార్డు మహమ్మద్ షాజాద్ మరియు కరీమ్ సాదిక్ పేరిట ఉంది.

వీరు స్కాట్లాండ్‌పై రెండవ వికెట్‌కు 218 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 ఫోర్లతో 145 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వన్డేల్లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతేడాది నవంబర్‌లో శ్రీలంకపై 162 పరుగుల ఇన్నింగ్స్‌తో జద్రాన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. జద్రాన్ కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 119 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేశాడు. అయితే అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ లో వీరిద్దరూ తప్ప మరే బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఆడలేదు. వీరిద్దరూ కాకుండా మరేవెరైనా బ్యాట్స్‌మెన్ వేగంగా ఇన్నింగ్స్ ఆడి ఉంటే అఫ్గానిస్థాన్ స్కోరు మరింత పెరిగి ఉండేది.