IND Vs ENG: విశాఖలో టీమిండియా రికార్డులివే.. రెండో టెస్టులో గెలిచేనా..?

విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 03:55 PM IST

IND Vs ENG: హైదరాబాద్ టెస్టులో ఓడిపోవడంతో షాక్ తిన్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే విశాఖ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ షురూ చేశాయి. సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా విశాఖ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న భారత్‌కు ఇక్కడ మంచి రికార్డే ఉంది. విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Indian Graziers: చైనాకు చుక్కలు చూపించిన భారత గొర్రెల కాపర్లు.. మీ తోక కత్తిరించేందుకు వీళ్లు చాలురా..

ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు. అయితే కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా రానున్న మ్యాచ్‌లో ఆడకపోవడం రోహిత్‌ సేనకు ఎదురుదెబ్బ లాంటిదే. దీని తర్వాత, 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టుకు విశాఖ టెస్ట్ మరింత కీలకం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ర్యాకింగ్స్‌‌లో మరింత కిందకు దిగజారడమే దీనికి ప్రధాన కారణం.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే వరుస విజయాలు తప్పనిసరి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే గాయాలతో జడేజా, రాహుల్ దూరమవడం కూడా ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి.