UPPAL STADIUM: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్.. విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ, లంచ్

వన్డే ప్రపంచకప్ కోసం సరికొత్తగా ముస్తాబైన ఉప్పల్ స్డేడియంలో భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 05:23 PM IST

UPPAL STADIUM: కొత్త సంవత్సరంలోనూ భారత క్రికెట్ జట్టు బిజీబిజీగా గడపనుంది. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా ఆప్ఘనిస్థాన్‌తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది. అది ముగిసిన వారం రోజుల్లోనే ఇంగ్లాండ్ టీమ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యమిస్తున్నాయి. మొదటి టెస్ట్ జనవరి 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్డేడియంలో జరగబోతోంది.

IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్..? ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్

వన్డే ప్రపంచకప్ కోసం సరికొత్తగా ముస్తాబైన ఉప్పల్ స్డేడియంలో భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్‌కు రావొచ్చని వెల్లడించింది. అయితే దీని కోసం పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలని సూచించింది. జనవరి 18వ తేదీలోపు హెచ్‌సీఏ సీఈవో ఈమెయిల్ ceo.hydca@gmail.comకు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. అయిదు రోజులు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుందని తెలిపింది.

2018లో చివరిసారిగా వెస్టిండీస్‌తో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగ్గా.. భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ హ్యాండ్ ఇచ్చింది. భారత్ ఆడే మ్యాచ్ లలో ఒక్కటి కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులకు తెలుగు రాష్ట్రాలే ఆతిథ్య అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా జరగనుంది. చివరి మూడు టెస్టులకు వరుసగా రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి.