భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టాప్-8లో ఉన్నాయి. ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్ టాప్-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 8న , చెన్నైలో భారత్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్టోబర్ 11, దిల్లీలో భారత్ X అఫ్గానిస్థాన్ మ్యాచ్. అక్టోబర్ 15, అహ్మదాబాద్ లో భారత్ X పాకిస్థాన్ మ్యాచ్. అక్టోబర్ 19, పుణె లో భారత్ X బంగ్లాదేశ్ మ్యాచ్. అక్టోబర్ 22, ధర్మశాలలో భారత్ X న్యూజిలాండ్ మ్యాచ్. అక్టోబర్ 29, లక్నలో భారత్ X ఇంగ్లాండ్ మ్యాచ్. నవంబర్ 2, ముంబయిలో భారత్ X శ్రీలంక మ్యాచ్. నవంబర్ 5, కోల్‌కతాలో భారత్ X దక్షిణాఫ్రికా మ్యాచ్. నవంబర్ 11, బెంగళూరులో భారత్ X నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది.