Ambati Rayudu: మరో సచిన్ కావాల్సిన వాడు.. కుళ్లు రాజకీయాలకు బలయ్యాడు! రాయుడుని తొక్కేసింది మనోళ్లే

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయాలకు ఎంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బలైపోయారో తెలియదు కానీ.. ఆ లిస్ట్‌లో మాత్రం అంబటి రాయుడు అందరికంటే ఫస్ట్ ఉంటాడు. హెచ్‌సీఏ కుళ్లు రాజకీయాలే లేకపోయి ఉంటే టీమిండియా గర్వించదగ్గ ఆటగాళ్లలో రాయుడు ముందువరుసలో ఉండేవాడు.

భారత్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు రాయుడుదే! గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు కెరీర్‌ ప్రారంభించిన మొదట్లో అంతా సచిన్ అవుతాడని భావించారు..! మరో సచిన్‌ వచ్చాడని పేపర్లో కథనాలు కూడా వచ్చేవి.. అతని స్ట్రోక్‌ ప్లే అలా ఉంటుంది మరి..! కచ్చితత్వంతో కూడిన షాట్లు కొట్టడంలో రాయుడు దిట్ట..! ఫాస్ట్‌ బౌలర్లపైనా ఎదురుదాడికి దిగే రాయుడు స్ట్రైట్‌గా సిక్స్‌ కొట్టడంలో ఎక్స్‌పర్ట్.. స్పిన్నర్ల బౌలింగ్‌ ఫేస్‌ చేయడంలో రాయుడు టెక్నిక్‌ సచిన్‌ని పోలి ఉంటుంది. సచిన్ బాల్‌ స్పిన్‌ అవ్వకముందే దాన్ని బౌండరీ అవతల పడేస్తాడు..రాయుడు కూడా అంతే.. టెక్నికల్‌గా రాయుడుకి వీక్‌పాయింట్ ఏదీ లేదు..! అలాంటి రాయుడు మరి టీమిండియాకు ఎందుకు దూరమయ్యాడు..? అసలు రాయుడిని మొదట్లో టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయలేదు..?

అంబటి రాయుడు కెరీర్‌ మొదటి నుంచే అనేక వివాదాల మధ్య సాగింది. టీమ్‌లోకి వస్తాడనుకున్న ప్రతిసారి రాయుడుకు అప్పటి సెలక్టర్లు మొండిచెయ్యి చూపించారు..అయితే దీనికి అనేక కారణాలున్నాయి. రాయుడు బిహేవియర్‌ బ్యాడ్‌ అని చిత్రకరీంచే ప్రయత్నం చేసింది హెచ్‌సీఏ. రాయుడు కూడా లిమిట్ దాటి ప్రవర్తించాడు. హైదరాబాద్‌ కోచ్‌పైకి బ్యాట్‌ విసిరాడు. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషర్‌ మాజీ సెక్రటరీ శివలాల్‌ యాదవ్‌తో రాయుడుకు ఉన్న గొడవ కారణంగానే అతని కెరీర్‌ ఎదగలేదు. తన ఇన్‌ఫ్లుయెన్స్‌తో శివలాల్‌యాదవ్‌ తన కొడుకు అర్జున్‌ యాదవ్‌ను హైదరాబాద్‌ టీమ్‌లోకి తీసుకొచ్చాడు.. ఇది అప్పటి హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్న అంబటిరాయుడుకు నచ్చలేదు.. ఇదే విషయంలో అప్పటి కోచ్‌తో గొడవపడడం తీవ్ర వివాదాస్పదమైంది.

ఇదంతా 2006లో జరిగింది.. ఆ తర్వాత రాయుడు ఐసీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం..దాన్ని బీసీసీఐ నిషేధించడం.. ఆ తర్వాత 2008లో ఐపీఎల్‌ ప్రారంభమవడం.. 2010లో రాయుడు ముంబై ఇండియన్స్‌లో చేరడం చకాచకా జరిగిపోయాయి.. ఇక అప్పటినుంచి రాయుడు కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. ముంబై టీమ్‌కు అదిరిపోయే విజయాలు అందించిన రాయుడు ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌లోనూ దుమ్మురేపాడు.. అదే ఫామ్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. 50 సగటుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నాలుగో నంబర్‌ స్థానం రాయుడిదేనని.. 2019 ప్రపంచ కప్‌లో రాయుడుతోనే నంబర్‌ 4 స్థానం భర్తీ చేస్తామని అప్పటి కెప్టెన్‌ కోహ్లీ కూడా ప్రకటించాడు.. అయితే ఇంతలోనే ట్విస్ట్‌.

రాయుడు కెరీర్‌లో మరో విలన్‌ MSKప్రసాద్‌..!కచ్చితంగా రాయుడిదే నంబర్‌ 4 స్థానం అంతా భావించిన సమయంలో అప్పటి సెలక్టర్‌ MSKప్రసాద్‌ తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదమైంది. రాయుడికి బదులుగా విజయ్‌ శంకర్‌ని ఎంపిక చేయడం విశ్లేషకులను సైతం ఆశ్చర్చపరిచింది. 3డీ(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) ప్రతిపాదికన విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశామని MSKప్రసాద్‌ చెప్పడంపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాయుడు దీటుగా స్పందించాడు కూడా. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను చూడటానికి 3డీ గ్లాసులు కొనుగోలు చేశానని రాయుడు కౌంటర్‌ వేశాడు.. ఆవేశంలో రిటైర్‌మెంట్‌ కూడా ప్రకటించేశాడు..అయితే మరునాడే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్‌లో చెన్నై తరుఫున తన కెరీర్‌ కంటీన్యూ చేశాడు..ఇక గతేడాదే రాయుడు రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని అనుకున్నారు..అయితే చెన్నై మేనేజ్‌మెంట్‌ కోరిక మేరకు ఈ ఏడాది వరకు తన ఆటను కొనసాగించిన రాయుడు.. ఇప్పుడు కాంపిటేటివ్‌ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు.