ICC ODI Rankings: పాక్‌ను దెబ్బకొట్టిన టీమిండియా.. మూడో స్థానానికి పడిపోయిన పాక్..!

తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఏకంగా మూడో ర్యాంకుకు పడిపోయింది. 42 ఓవర్లకు కుదించిన వర్చువల్ నాకౌట్ మ్యాచులో పాకిస్తాన్‌పై ఉత్కంఠ భరిత విజయం సాధించింది శ్రీలంక. అదే సమయంలో ఆసియా కప్‌లో భారత్ ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:34 PM IST

ICC ODI Rankings: శ్రీలంక చేతిలో ఓడిపోయి ఆసియా కప్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. వన్డేల్లో నెంబర్ వన్ టీంగా ఈ టోర్నీ ప్రారంభించిన పాక్.. ఇప్పుడు ఆ స్థానం కోల్పోయింది. తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఏకంగా మూడో ర్యాంకుకు పడిపోయింది. 42 ఓవర్లకు కుదించిన వర్చువల్ నాకౌట్ మ్యాచులో పాకిస్తాన్‌పై ఉత్కంఠ భరిత విజయం సాధించింది శ్రీలంక. అదే సమయంలో ఆసియా కప్‌లో భారత్ ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇక, ప్రస్తుతం 115 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ మూడో స్థానానికి చేరింది. అదే సమయంలో 116 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్‌లో 118 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఈ ఆసియా కప్‌లో బ్యాటుతో పెద్దగా రాణించని పాక్ సారథి బాబర్ ఆజమ్ మాత్రం వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానం కాపాడుకున్నాడు. అదే సమయంలో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన శుభ్‌మన్ గిల్.. తన కెరీర్ అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. టాప్ టెన్ వన్డే బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి గిల్, రోహిత్, కోహ్లీ ముగ్గురు ఉండటం గమనార్హం.