IND VS AFG: ఇండియా-ఆఫ్గన్ తొలి టీ20.. కోహ్లీ దూరం..

టీ ట్వంటీ వన్డేప్రపంచకప్‌నకు ముందు ఆడే చివరి సిరీస్ ఇదే కావడంతో జట్టు కూర్పును సిద్ధం చేసుకునేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే కూతురు బర్త్ డే కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

  • Written By:
  • Updated On - January 11, 2024 / 03:04 PM IST

IND VS AFG: టీమిండియా కొత్త ఏడాదిలో క్రికెట్ సీజన్‌ను టీ ట్వంటీ సిరీస్‌తో మొదలుపెట్టబోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి టీ ట్వంటీ ఆడనుంది. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్.. దాదాపు ఏడాది తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. టీ ట్వంటీ వన్డేప్రపంచకప్‌నకు ముందు ఆడే చివరి సిరీస్ ఇదే కావడంతో జట్టు కూర్పును సిద్ధం చేసుకునేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు.

Kadiyam Srihari: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలు.. 2028లో అధికారం బీఆర్ఎస్‌దే: కడియం శ్రీహరి

అయితే కూతురు బర్త్ డే కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు చోటు దక్కొచ్చు. సీనియర్ క్రికెటర్ల కంటే యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియ , సౌతాఫ్రికా సిరీస్‌లలో సత్తా చాటిన రింకూ సింగ్‌పై అంచనాలున్నాయి. ఫినిషర్‌గా తన ప్లేస్ మరింత సుస్థిరం చేసుకోవాలంటే రింకూ సింగ్ తన ఫామ్ కొనసాగించాల్సిందే. వికెట్‌ కీపర్‌ కోసం సంజూ శాంసన్‌, జితేశ్‌ మధ్య గట్టిపోటీనే ఉంది. గత రెండు సిరీస్‌ల్లో ఆడిన జితేశ్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశమిస్తుందని అంచనా. ఇక హార్దిక్‌ పాండ్య స్థానాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత శివమ్‌ దూబెపై ఉంది. పేసర్లుగా అవేష్‌, ముకేశ్‌, అర్ష్‌దీప్‌ ఆడనుండగా.. స్పిన్నర్‌గా కుల్‌దీప్‌‌కు ప్లేస్ ఖాయం. మరో ప్లేస్ కోసం అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ రేసులో ఉన్నప్పటికీ.. బ్యాట్‌తోనూ రాణించే అక్షర్‌కు చోటు దక్కొచ్చు. మరోవైపు స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకుండానే ఆఫ్గనిస్తాన్ ఈ సిరీస్‌లో‌ బరిలోకి దిగుతోంది.

రషీద్‌ లేకపోయినా అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మొహాలి పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. రికార్డులను చూస్తే ఛేజింగ్ జట్టే ఎక్కువసార్లు గెలిచింది. గత రికార్డుల ప్రకారం భారత్‌కే అడ్వాంటేజ్. ఇక్కడ 4 మ్యాచ్్లు ఆడిన భారత్ మూడింటిలో గెలిచింది. మంచుప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.