IND vs AFG: ఊహించినట్టుగానే ఆఫ్గనిస్తాన్‌తో భారత్ టీ ట్వంటీ సిరీస్ వన్ సైడ్‌గా మారింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. బుధవారం బెంగళూరు వేదికగా జరగనున్న ఆఖరి పోరులోనూ గెలిచి సీరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది.
Sania delete Shoib Photos:సానియా-షోయబ్ విడాకులేనా ? అందుకే ఆ ఫోటోలు తీసేసిందా ?
యువ ప్లేయర్లు సత్తా చాటుతుండంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ తేల్చుకోలేక పోతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ప్లేయర్లకు బెంగళూరు మ్యాచ్‌లో అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. 14 నెలల తర్వాత టీ20ల్లోకి తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తుదిజట్టులో కొనసాగుతారు. తొలి టీ20కి దూరమైన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆఖరి టీ20లోనూ రోహిత్‌కు జతగా అతడే ఓపెనింగ్‌కు రానున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్‌కు నిరాశ తప్పేలా లేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబె తన నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే అయిదో స్థానంలో జితేశ్ శర్మకు బదులుగా సంజు శాంసన్‌కు అవకాశం దక్కేలా ఉంది. బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమవ్వడంతో సంజుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇక ఆరోస్థానంలో వస్తూ ఫినిషర్‌గా సత్తాచాటుతున్న రింకూ సింగ్‌ను, స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్‌ను, వాషింగ్టన్ సుందర్‌ను ఆఖరి మ్యాచ్‌లోనూ కొనసాగించనున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. వారిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.