India vs England: ఇంగ్లాండ్‌తో హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆరంభమైన తొలి టెస్ట్, మొదటి రోజు భారత్ అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ డామినేట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ధాటిగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తర్వాత భారత స్పిన్నర్లు రంగంలోకి దిగేసరికి ఇంగ్లండ్ కథ మారిపోయింది.
MEGASTAR CHIRANJEEVI: విశ్వంభర తర్వాత ఎవరితో.. చిరు కోసం త్రివిక్రమ్, పూరీ వెయిటింగ్..?
అశ్విన్, జడేజా ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది. అయితే చివరి సెషన్‌లో బెన్ స్టోక్స్ చెలరేగాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. బుమ్రా అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు 246 రన్స్ దగ్గర తెరపడింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత.. భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76, శుభ్‌మన్ గిల్ 14 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం భారత్ ఇంకా 127 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు కూడా భారత్ ఇదే ఆటతీరు కనబరిస్తే.. తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్ స్కోరును చేరుకునే అవకాశం ఉంది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న యశస్వి జైశ్వాల్‌తో పాటు మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా ఉండటంతో భారీ ఆధిక్యంపై కన్నేసింది.