Jasprit Bumrah: అవి బంతులు కాదు బుల్లెట్లు.. విశాఖలో ‘ఆరే’సిన బూమ్రా

వరుసగా ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. సీనియర్ బ్యాటర్లు స్టోక్స్, రూట్, బెయిర్ స్టో కూడా బూమ్రా ట్రాప్‌లో చిక్కక తప్పలేదు. అసలు బూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 07:51 PM IST

Jasprit Bumrah: స్పిన్ పిచ్‌తోనే రెండో టెస్టుకు భారత్ రెడీ అయిందనుకున్న ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్పోర్టివ్‌గా ఉన్న పిచ్‌పై స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా యార్కర్లతో చెలరేగిపోయాడు. వరుసగా ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. సీనియర్ బ్యాటర్లు స్టోక్స్, రూట్, బెయిర్ స్టో కూడా బూమ్రా ట్రాప్‌లో చిక్కక తప్పలేదు. అసలు బూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది.

India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం

ఔటైన తర్వాత ఇంగ్లీష్ బ్యాటర్లు షాక్‌తో క్రీజులో నిలబడ్డారంటే బంతులు ఎలా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్‌కు అడ్వాంటేజ్‌గా ఉన్న పిచ్‌పై బజ్‌బాల్ గేమ్‌తో దూకుడుగా ఆడే ఇంగ్లండ్‌తో బుమ్రా ఆరు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. తద్వారా తాను అసాధారణ బౌలరననే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు. బుమ్రా బుల్లెట్ యార్కర్‌కు ఓలీపోప్ క్లీన్ బౌల్డ్ కాగా.. స్టన్నింగ్ స్వింగర్లకు జోరూట్, జానీ బెయిర్ స్టో టామ్ హార్ట్‌లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఇక స్టోక్స్‌ను ఔట్ చేసిన బూమ్రా బంతికి స్టేడియం హోరెత్తిపోయింది.

ఇంగ్లాండ్ డ్రెస్సింగ్‌ రూమ్ సైతం ఈ బాల్‌ను చూసి నివ్వెరపోయింది. బూమ్రా స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్‌ అయిన బెన్ స్టోక్స్ సైతం నోరెళ్లబెట్టాడు. ఇలాంటి బంతులను అసలు ఎలా ఆడాలంటూ బూమ్రా ప్రశ్నిస్తూ అతను చేసిన సైగలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్ టెస్టులోనూ బూమ్రా బౌలింగ్‌లోనే స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.