Visakhapatnam: ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో టెస్టు మ్యాచ్.. టిక్కెట్ల అమ్మకాలు ఎప్పటి నుంచి మొదలంటే..

విశాఖలోని వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) శుక్రవారం సమావేశమైంది. మ్యాచ్ సన్నాహక ఏర్పాట్లపై చర్చించింది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - January 13, 2024 / 05:42 PM IST

Visakhapatnam: ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam)లో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు టెస్టు మ్యాచ్ జరగనుంది. విశాఖలోని వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) శుక్రవారం సమావేశమైంది. మ్యాచ్ సన్నాహక ఏర్పాట్లపై చర్చించింది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు వెల్లడించారు.

JANASENA: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. జనసేనలోకి మరో సిట్టింగ్‌ ఎంపీ జంప్‌!

సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 26నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తారు. ప్రతి రోజూ 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ఇండియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలతో, తగిన ఏర్పాటు చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. దేశ, విదేశీ అభిమానులకు స్టేడియం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు. మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు. ప్రేక్షకులకు తాగునీరు, మెడికల్‌ సదుపాయాలు, తగినన్ని ఫుడ్ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పేటీఎం యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. వాటి ధరలు రోజు వారీ విడిగా.. 100, 200, 300, 500 ఉండగా, ఐదు రోజులు కలిపి రూ.400, 800, 1,000, 1,500గా ఉండనున్నాయి. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను విక్రయించబోతున్నారు.