UPPAL STADIUM: ఉప్పల్‌లో తిరుగులేని భారత్‌.. అశ్విన్‌కు ఇక్కడ సూపర్ రికార్డ్..

తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్‌ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్‌ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్‌ కూడా ఒకటి. ఇక్కడ ఐదు టెస్టులాడిన భారత్‌.. నాలుగింట్లో విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 01:54 PM IST

UPPAL STADIUM: హైదరాబాద్‌లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ఎదురులేని భారత్‌.. బజ్‌బాల్‌ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్‌ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్‌ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది.

BCCI AWARDS: కన్నుల పండుగగా బీసీసీఐ అవార్డులు.. మెరిసిన స్టార్ క్రికెటర్లు

ఉప్పల్‌ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్‌ కూడా ఒకటి. ఇక్కడ ఐదు టెస్టులాడిన భారత్‌.. నాలుగింట్లో విజయం సాధించింది. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లపై గెలిచింది. ఇక ఉప్పల్ స్డేడియం పిచ్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్‌.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఆడిన అన్నింట్లోనూ భారత్‌ గెలిచింది. అలాగే రవీంద్ర జడేజా కూడా ఇక్కడ రాణించాడు. మరోవైపు బ్యాటింగ్‌లో ఇక్కడ డబుల్ సెంచరీలు చేసిన రికార్డులు పుజారా, విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి. వీరిద్దరూ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. 2018లో ఉప్పల్‌లో చివరిసారిగా వెస్టిండీస్‌తో భారత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది.

ఈ సారి కూడా ఉప్పల్ స్టేడియం.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇరు జట్లూ రెడీ అవుతున్నాయి. బాజ్‌బాల్ క్రికెట్‌తో వరుస విజయాలు సాధించిన ఇంగ్లీష్ టీమ్‌కు స్పిన్‌ పిచ్‌లు సవాల్‌గానే చెప్పాలి. ముఖ్యంగా అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం ఇంగ్లీష్ బ్యాటర్లకు అంత ఈజీ కాదు. ఇదిలా ఉంటే కోహ్లీ హైదరాబాద్ మ్యాచ్‌కు దూరమడం అభిమానులకు నిరాశ కలిగించినా.. రోహిత్, గిల్, కెఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్స్‌ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.