India vs Pakistan: ఒక్కో టిక్కెట్ ధర రూ. 1.86 కోట్లు.. అట్లుంటది భారత్ – పాక్ మ్యాచ్ క్రేజ్

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఇటు జట్లు జూన్‌ 9న న్యూయర్క్‌ వేదికగా తలపడనున్నాయి. దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 05:13 PM IST

India vs Pakistan: వరల్డ్‌ క్రికెట్‌లో పాకిస్తాన్‌- భారత్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల జట్లు ఎప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన ఇండియా, పాకిస్తాన్‌లు ఎక్క‌డ త‌ల‌ప‌డినా ఇరుదేశాల ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోతుంది. ఇప్పుడు మరోసారి విశ్వవేదికపై దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది.

PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఇటు జట్లు జూన్‌ 9న న్యూయర్క్‌ వేదికగా తలపడనున్నాయి. దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టిక్కెట్‌ ధర అత్యధికంగా రూ. 1.8 కోట్లు పలుకుతోంది. యూఎస్‌ఏ టూడే రిపోర్ట్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్ సీట్‌గీక్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్‌గీక్‌లో అత్య‌ధిక ఖరీదైన టికెట్ ధర 175,000 డాలర్లగా నిర్ణయించినట్లు యూఎస్‌ఏ టూడే తమ కథనంలో పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ.1.4 కోట్లు.

అద‌న‌పు చార్జీ రూ. 4 ల‌క్ష‌లు క‌లిపి మొత్తంగా టికెట్ ధ‌ర రూ. 1.86 కోట్లు. అటు పలు ఆన్‌లైట్‌ ప్లాట్‌ఫారమ్స్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నాయి. అధికారికంగా 400 డాల‌ర్లు ఉన్న టిక్కెట్‌ సెకెండరీ మార్కెట్‌లో 40,000 డాల‌ర్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. టాక్స్‌తో కలిపి ఏకంగా 50,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ , పాక్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు