IND Vs SA: ఆరుగురు డకౌట్‌.. పేకపేడలా కూలిన భారత్‌ బ్యాటింగ్‌

తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఈ ముగ్గురు మినహా.. దాదాపు అందరూ సున్నాలు చుట్టేశారు.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 10:23 PM IST

IND Vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బ్యాటింగ్‌లో తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఈ ముగ్గురు మినహా.. దాదాపు అందరూ సున్నాలు చుట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు.. అదేదో పని ఉన్నట్లు.. ఔట్ అవడమే పని అయినట్లు.. పెవిలియన్ చేరుకున్నారు.

Mohammed Siraj: ఆరేసిన సిరాజ్.. 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్..

టీ బ్రేక్‌ టైమ్‌కు 4వికెట్ల నష్టానికి 111 పరుగులతో పర్లేదు అనిపించిన టీమిండియా. చివరి సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది. ఎంగిడి, రబాడ.. భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రాను పెవిలియన్‌ చేర్చాడు. 46రన్స్‌ చేసిన కోహ్లీ.. భారత బ్యాటర్లలో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ 39, గిల్‌ 36రన్స్‌ సాధించారు. కేఎల్ రాహుల్‌ 8 రన్స్ చేసి ఔట్ అవగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ సున్నా చుట్టేశారు. జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ కృష్ణా.. ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరుకున్నారు. భారత్ బ్యాటింగ్‌ పేకమేడను తలిపించింది. క్రీజులోకి నడుచుకుంటూ వచ్చినంత సేపు కూడా.. క్రీజులో నిల్చోలేకపోయారని.. భారత బ్యాట్స్‌మెన్‌ను ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.

ఐతే అంతకుముందు బౌలింగ్‌లో టీమిండియా అదరగొట్టింది. బంతులా.. బుల్లెట్లా అనే రేంజ్‌లో సిరాజ్ విరుచుకుపడ్డాడు. దీంతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సిరాజ్‌ 6 వికెట్లు కూల్చగా.. బుమ్రా, ముకేశ్‌ కుమార్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు.. కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు. దీంతో టీమిండియా పేసర్లు ఏడాది వ్యవధిలో అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుత టెస్టు ఫార్మాట్‌లో ప్రొటీజ్‌ టీమ్‌ను 55 రన్స్‌కే ఆలౌట్ చేసిన భారత్.. వన్డే ఫార్మాట్‌లో లంక జట్టును 50 పరుగులకే చుట్టేసింది. టీ20లో న్యూజిలాండ్ జట్టును కేవలం 66 పరుగులకే కట్టడి చేసింది. మూడు రకాల క్రికెట్‌లో ఏడాదిలోనే ఇతర జట్లను అతి తక్కువ మొత్తానికి కట్టడి చేసిన ఘనతను భారత పేసర్లు చేశారు.