ఈ మ్యాచ్ గెలిచాక కంఠీరవ స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన సుమారు 26 వేల మంది ప్రేక్షకులు.. కువైట్ పై భారత్ గెలవగానే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాటను ఆలపించారు. పెనాల్టీ షూటౌట్ లో మ్యాచ్ గెలిచాక స్టేడియంలో ప్రేక్షకులంతా ఒక్కసారిగా పైకి నిలబడి.. వందేమాతరమ్, మా తుఝే సలామ్ అంటూ నినదించారు.
వీరికి భారత సారథి సునీల్ ఛెత్రితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా జతకలిశారు. మ్యాచ్ గెలిచాక భారత ఆటగాళ్లు స్టేడియం అంతా కలియతిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్టేడియంలో 26వేల మంది ఒక్కసారిగా ‘వందేమాతరమ్’ అంటూ నినదించడంతో ఈ వీడియో చూస్తున్నవారికి రొమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.