పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత మహిళ క్రీడాకారులు (Indian Women Athletes) తమ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి.. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ (Athletics) లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా..
మొదటగా.. తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన తొలి మేజర్ మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (Badminton) లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఈ భారత సూపర్ స్టార్ వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించింది. ఈసారి మూడో పతకం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మహిళల సింగిల్స్ గ్రూపులో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబ్బా అబ్దుల్ రజాక్‌పై గెలిచి పివి సింధు తన విజయం అరంబించింది. తొలి గేమ్‌ను 21-9తో సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌ను 21-6తో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 27 నిమిషాల్లోనే ముగించింది.
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ (Table tennis) లో ఆకుల శ్రీజ సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ 64వ రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించారు. వరుసగా 4 గేమ్స్ గెలిచి శభాష్ అనిపించారు. 11-4, 11-9, 11-7, 11-8తో సునాయసంగా విజయం సాధించారు. దీంతో శ్రీజ 32వ రౌండ్‌కు అర్హత సాధించారు. ఇదే టేబుల్ టెన్నిస్ లో మనికా బాత్రా దుమ్ములేపుతుంది. మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో మనికా బాత్రా సత్తా చాటారు. బ్రిటన్‌కు చెందిన అన్నా హార్సీని 4-1 తేడాతో ఓడించి రౌండ్ 32కి అర్హత సాధించారు. ఇంతకుముందు తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సైతం టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ 64వ రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించారు.
ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 5వ స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇదే విభాగంలో ఎలవెనిల్ వలరివన్ 10వ స్థానంలో నిలవడంతో ఫైనల్లో అడుగు పెట్టలేకపోయారు. టాప్-8లో స్థానం సాధించిన వారు మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.
ఒలింపిక్స్ 2024 ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సాధించారు. మహిళల 50 కేజీల విభాగంలో 16వ రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు. 32వ రౌండ్‌లో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాపై 5:0 తేడాతో గెలిచారు.
ఒలింపిక్స్‌లో భారత మహిళా స్విమ్మర్ దినిది దేశింగు సెమీ ఫైనల్స్‌కు చేరారు. మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్-1లో ఆమె లక్ష్యాన్ని 2.06.36 నిమిషాల్లో చేరుకుని తొలి స్థానంలో నిలిచారు. భారత తరఫున బరిలోకి దిగిన మరో క్రీడాకారిణి.. శ్రీహరి నటరాజన్, దినిధి సెమీ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్-2లో 33వ స్థానంలో, దినిధి 200మీ ఫ్రీస్టైల్ హీట్-1లో 23వ స్థానంలో నిలిచారు. కాగా టాప్-16లో నిలిచిన వారు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.