PITCH EFFECT: ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచులు గెలిచి.. ఇక తిరుగులేదు అనుకున్న జట్టు ఫైనల్ మ్యాచ్‌లో బోల్తా పడింది. కప్పు చేతికి అందినట్టే అంది.. చేజారిపోయింది. గతంలో వరల్డ్ కప్‌లో నాకౌట్ దశలోనే టీమిండియా వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఫైనల్లో గెలుస్తారు.. సొంత గడ్డపై కప్పు కొడతారు.. మూడోసారి విజయం అందుకుంటారని ఆశలు పెట్టుకున్నారు కోట్ల మంది భారతీయులు.
KCR TEMPLE: అమ్మకానికి కేసీఆర్ గుడి.. ఇదేందయ్యా ఇది..
కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ఇంతకీ.. లోపం ఎక్కడ ఉంది..? వాల్డ్ కప్‌లో.. ఆసిస్ చేతిలో టీమిండియా ఓడిపోవడానికి.. మనోళ్ళు 240 పరుగులు మాత్రమే చేయడం.. బౌలర్లు రాణించకపోవడం, ఫీల్డింగ్ బాగోలేకపోవడం లాంటి ఎన్నో కారణాలను వెతికారు. ఒత్తిడి, ఇండియా టాస్ ఓడిపోవడం కూడా అని మెజార్టీ క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. కానీ అసలు కారణం ఇది కాదు. పిచ్ రూపొందించడంలో BCCI చేతగానితనమే ఇందుక్కారణం అని కొందరు క్రికెటర్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లు మంచి ఫామ్‌లో ఉంటే.. స్లో ట్రాక్ ఎలా తయారు చేశారని ప్రశ్నిస్తున్నారు. పిచ్ విషయంలో BCCI ప్లానింగ్ బెడిసి కొట్టిందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆస్ట్రేలియా కప్పు గెలిచిందని చెబుతున్నారు. అహ్మదాబాద్ పిచ్ గతంలోలాగే ఉంటే.. టీమిండియా గెలుపు ఖాయం అయ్యేది. అలాంటిది దాన్ని స్లో ట్రాక్‌గా ఎందుకు మార్చారు..? మన బౌలర్ల మీద BCCIకి నమ్మకం లేదా అని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.
ASSEMBLY ELECTIONS: మొదలైన ఓటింగ్ ప్రక్రియ.. తెలంగాణలో తొలి ఓటు వేసిన వృద్ధురాలు
లీగ్ మ్యాచులతో పాటు సెమీ ఫైనల్ దాకా కూడా మన క్రికెటర్స్.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. మరి స్లో పిచ్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. పిచ్ విషయంలో BCCI ప్లానింగ్ మిస్ ఫైర్ అయిందని అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, భారత్ వికెట్లు మొదట్లోనే కోల్పోవడంతో మిగతా క్రికెటర్లు ఒత్తిడిలో పడ్డారని చెబుతున్నాడు రికీ పాటింగ్. షాట్లు కొట్టలేని పరిస్థితి ఏర్పడటానికి కూడా పిచ్ స్లోయే కారణమని చెప్పాడు. అంతకుముందు అహ్మదాబాద్ పిచ్ మీద పరుగుల వర్షం కురిసింది. ఇక్కడ రెగ్యులర్ పిచ్‌పై భారీ స్కోర్లే రికార్డ్ అయ్యాయి. కానీ వరల్డ్ కప్‌కి వచ్చేసరికి BCCI వ్యూహం మార్చింది. రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్ రూపొందించింది. దాంతో టీమిండియా క్రికెటర్లు రన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడు వందలకు పైగా స్కోర్ దాటుతుంది అనుకుంటే.. 240 రన్స్ రావడానికే అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు కురవడం ఆస్ట్రేలియాకి కలిసొచ్చింది.
పిచ్ మరింత నిదానంగా మారి.. దాదాపు నిర్జీవమైంది. దాంతో ఆసిస్ క్రికెటర్లు విజృంభించి ఆడారు. హెడ్, లబూషేన్ క్రీజులో పాతుకుపోవడానికి కారణం కూడా అదే. అప్పటికే పిచ్ స్వరూపం మారిపోయింది అంటున్నారు నిపుణులు. బీసీసీఐ ప్లానింగ్ వల్లే టీమిండియా ఓడింది అని కొందరు ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మళ్లీ ICC వాల్డ్ కప్పు కోసం భారత్ మరో నాలుగేళ్ళ దాకా వెయిట్ చేయాలి కదా.