IPL: 1000 మ్యాచ్ ముంబై Vs చెన్నై

ఐ పి ఎల్ 2023 లో రంజితంగా సాగే మరో మ్యాచ్ కు ముంబై వాంఖడే స్టేడియం వేదిక కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో ఓడిపోయి, రెండో మ్యాచులో గెలుపొందింది. మరో వైపు ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై, కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంది. హెడ్ టూ హెడ్ చూస్తే, ఇప్పటి వరకు ఎం ఐ, సి ఎస్ కె జట్లు ఐ పి ఎల్ హిస్టరీలో 34 సార్లు తలపడగా, ముంబై 20 సార్లు గెలవగా, చెన్నై జట్టు 14 సార్లు గెలిచింది.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 04:00 PM IST

చివరగా ఈ ఇరు జట్లు తలపడ్డ 2 మ్యాచుల్లో చెరోసారి విజయాన్ని అందుకున్నాయి. లాస్ట్ సీజన్లో ఒక మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 98 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ చేధించింది. ఈ మ్యాచులో చెన్నై నుంచి అంబటి రాయుడు, ముంబై నుంచి తిలక్ వర్మలు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. చెన్నై జట్టులో ఋతురాజ్ గైక్వాడ్ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు.

బౌలింగ్ లో చెన్నై వీక్ గా ఉన్నప్పటికి, స్పిన్నర్లు మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు చెన్నైకు వెన్నుముకగా నిలవనున్నారు. బ్యాటింగ్ పిచ్ మీద ఛేజింగ్ పెద్ద కష్టమేమి కాదు, అందుకే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 180 కి పైగా టార్గెట్ విధిస్తే కానీ, గెలుపు మీద ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ముంబై ప్రధాన బౌలర్ జొఫ్రా ఆర్చర్ ఇంకా వికెట్ల వేటను మొదలుపెట్టనేలేదు. ధోని సాలిడ్ టచ్ తో లాస్ట్ మ్యాచులో అభిమానులను అలరించాడు. మొత్తానికి నేటి మ్యాచ్, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కి, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కి మధ్య జరగనుంది.