సంజూ నాయకత్వంలో జొస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రోను హేట్మేయర్, జాసన్ హోల్డర్, జో రూట్, రియాన్ పరాగ్, దేవధూత్ పడిక్కల్ వంటి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఢిల్లీ జట్టులో కెప్టెన్ వార్నర్ కి తోడుగా, పృథ్వి షా, మిచెల్ మార్ష్, రిలీ రొస్సౌ, రోవ్ మన్ పావెల్, ఫిల్ సాల్ట్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే, రాజస్థాన్ దగ్గర, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, అశ్విన్, అసిఫ్, చాహల్, జంపా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. మొదట బ్యాటింగ్ చేస్తే, సునాయాసంగా రెండు వందలకు పైగా పరుగులు చేయగల సత్తా, ఇరు జట్ల సొంతం.
గౌవతిలో జరిగే మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత సీజన్ మ్యాచుల్లో, ఒక దాంట్లో ఢిల్లీ గెలవగా, రెండో దాంట్లో రాజస్థాన్ గెలిచింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లకు రాజస్థాన్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. జొస్ బట్లర్, దేవదూత్ పడిక్కల్, సంజూ సాంసన్ లకు ఢిల్లీ మీద ది బెస్ట్ పాస్ట్ ఉంది. ఢిల్లీ ఒక మ్యాచులో కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేధించగా, మరో మ్యాచులో చివరి వరకు పోరాడిన ఢిల్లీ, 223 పరుగుల భారీ టార్గెట్ కు, 15 పరుగుల దూరంలో ఓటమిని అంగీకరించింది. నేటి మ్యాచులో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫెవరైట్ గా బరిలో దిగనుంది.