IPL 2023: గుజరాత్‌కు టఫ్‌ గేమ్‌ తప్పదా ? ఢిల్లీ VS గుజరాత్ మ్యాచ్ ప్రివ్యూ

ఈరోజు జరగనున్న ఢిల్లీ వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌కి వర్షం బ్రేక్‌ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న చిరుజల్లులతో కొంచెం టెన్షన్‌ పెట్టిన వాన.. తర్వాత అగిపోయింది. ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిన్నటి వర్షానికి పిచ్‌ కాస్త ఫ్రెష్‌గా మారింది. దానికితోడు గ్రౌండ్‌ కూడా చిన్నిగా ఉండటంతో.. రన్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 03:00 PM IST

ఒకవేళ వర్షంతో బ్రేక్‌ పడకపోతే.. చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్‌లా ఇవాళ కూడా హైస్కోరింగ్ గేమ్‌ పక్కాగా ఉండబోతుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య, విజయ్ శంకర్, రాహుల్ తివాటియాలు 2019 నుంచి స్లో లెఫ్టార్మ్ బౌలర్స్‌ వల్ల స్ట్రగుల్ అవుతున్నారు. అక్షర్ పటేల్ లెప్ట్ఆర్మ్ స్పిన్, ఆర్మ్ బాల్ కూడా వేయగల కెపాసిటీ ఉన్న బౌలర్. అక్షర్‌ బౌలింగ్‌లో ఎలా ఆడతారో చూడాలి.

ఢిల్లిలో భారీ హిట్టర్లు ఉన్నా.. లాస్ట్ మ్యాచ్‌లో చేతులెత్తయడంతో ఘోర ఓటమి చూసింది. కానీ.. ఈరోజు ఢిల్లీ హోమ్‌ గ్రౌండ్ అడ్వంటేజ్ ఉండడంతో ప్లేయర్స్‌ బెటర్‌గా ఫెర్ఫామెన్స్‌ ఇచ్చే ఛాన్స్ ఉంది. కేన్ విలియమ్సన్ ఇంజురితో రూల్డ్‌అవుట్ అయినా.. ఆ ప్లేస్‌లో సౌత్‌ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను రిప్లేస్ చేస్తారు. రిప్లేస్‌మెంట్ తర్వాత కూడా మిడిల్‌ ఆర్డర్ స్ర్టాంగ్‌గా ఉన్నా.. టాప్‌ ఆర్డర్‌ మాత్రం వీక్‌గానే ఉంది. ఈరోజు మ్యాచ్‌తో సౌత్‌ ఆఫ్రికా ప్లేయర్స్ అవైలబుల్‌గా ఉంటారు.

ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు గుజరాత్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఢిల్లీ టీంను తక్కువ అంచనా వేయొద్దంటున్నారు అనలిస్ట్‌లు. ఎందుకంటే ఆ టీంకు డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలో సింగిల్‌ హ్యాండ్‌తో ట్రోఫీ కొట్టేశారు హైదరాబాద్‌ టీం. ఇప్పుడు రెండు టీమ్స్‌లో ప్లేయింగ్‌ లెవెల్‌లో పెద్దగా చేంజెస్‌ లేకపోయినా.. వార్నర్‌ కెప్టెన్సీలో గుజరాత్‌ టఫ్‌ మ్యాచ్‌ ఫేస్‌ చేయాల్సిందే.