IPL 2024 Auction: కత్తిలాంటి ఐడియాలతో కావ్య పాప.. ఐపీఎల్ వేలంలో ఇదే ప్లాన్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను మొత్తం రూ.34 కోట్లకు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే, ఈ వేలంలో ఒక్కో ఆటగాడిపై హైదరాబాద్ సగటున 5-6 కోట్లు వెచ్చించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఈ జట్టు ఖచ్చితంగా కనీసం ఇద్దరు ఆటగాళ్లపై భారీ బిడ్ వేసే ఛాన్స్ ఉంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 05:01 PM IST

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం జరుగుతుంది. అంటే ఇప్పుడు వేలానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం పది ఐపీఎల్ జట్లు ఈ వేలానికి పూర్తి సన్నద్ధమయ్యాయి. ఆ జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈసారి గుజరాత్ టైటాన్స్ తర్వాత ఎక్కవ పర్స్‌ వ్యాల్యూ కలిగి ఉంది హైదరాబాద్ జట్టే. ఈ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు రూ.34 కోట్ల పర్స్‌తో వెళుతోంది. మొత్తం 6 స్లాట్లు మిగిలి ఉన్నాయి. అందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.

SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..

అంటే ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను మొత్తం రూ.34 కోట్లకు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే, ఈ వేలంలో ఒక్కో ఆటగాడిపై హైదరాబాద్ సగటున 5-6 కోట్లు వెచ్చించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఈ జట్టు ఖచ్చితంగా కనీసం ఇద్దరు ఆటగాళ్లపై భారీ బిడ్ వేసే ఛాన్స్ ఉంది. ఈ వేలానికి రాకముందు హైదరాబాద్ జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసి కేవలం 6 మంది ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసింది. రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో కొంతమంది కీలక భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. వీరు కాకుండా, విదేశీ ఆటగాళ్లలో ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జెన్సన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి వేలంలో హైదరాబాద్ ఒక విదేశీ స్పిన్నర్, కొంతమంది బలమైన ఫాస్ట్ బౌలర్లు, కొంతమంది బ్యాట్స్‌మెన్‌లపై దృష్టి పెట్టనుంది. హైదరాబాద్‌లో ఒకప్పుడు రషీద్ ఖాన్ ఉన్నాడు. అతని గైర్హాజరు ఇంకా భర్తీ కాలేదు. ఈసారి అదిల్ రషీద్, అకిల్ హుస్సేన్‌లను విడుదల చేసింది. ఇటువంటి పరిస్థితిలో ఎస్‌ఆర్‌హెచ్ దృష్టి వనిందు హసరంగా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, మోర్గాన్ అశ్విన్ లేదా శ్రేయాస్ గోపాల్ వంటి ఆటగాళ్లపై ఉంటుంది.

పేస్ ఎటాక్ గురించి మాట్లాడితే, ఈ జట్టులో భువనేశ్వర్, టి నటరాజన్, మార్కో జెన్సన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే, ఇప్పటికీ ఉమ్రాన్ ఎకానమీ, భువనేశ్వర్ స్పీడ్‌ను పరిశీలిస్తే, ఈ జట్టుకు యువ ఫాస్ట్ బౌలర్ అవసరం. అందువల్ల, ఈ జట్టు గెరాల్డ్ కోయెట్జీ లేదా మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్ల కోసం పెద్ద బిడ్‌లు వేయవచ్చు. వీరితో పాటు, ఈ జట్టు హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లపై కూడా దృష్టి పెడుతుంది. అవసరమైతే, ఈ జట్టు ఈ ఆటగాళ్ల కోసం కూడా రూ.7-10 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఇవన్నీ కాకుండా, గత సంవత్సరం ఈ టీమ్ 13.25 కోట్ల భారీ బిడ్‌తో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను ఈ సంవత్సరం హైదరాబాద్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ జట్టు బ్రూక్ స్థానంలో కూడా మరో ఆటగాడి కోసం వెతుకుతుంది. హ్యారీ బ్రూక్ స్థానంలో ట్రావిస్ హెడ్, డారిల్ మిచెల్ లేదా షారుఖ్ ఖాన్‌తో వచ్చే అవకాశం ఉంది.