Lucknow Super Giants: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ డేవిడ్ విల్లే లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా స్వదేశానికి పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్న విల్లే.. పీఎస్‌ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు.
MS Dhoni: చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్ బై.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్న విల్లే కుటుంబంతో కొద్ది రోజులు గడిపి తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్నో మేనేజ్‌మెంట్ విల్లేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఏది ఏమైనా విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా తెలుస్తుంది. విల్లేను ఐపీఎల్ 2024 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. విల్లే ఉన్నపళంగా హ్యాండ్ ఇవ్వడంతో ఎల్‌ఎస్‌జీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇదివరకే మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ స్వదేశీ బోర్డు అంక్షలు విధించడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
వుడ్ స్థానాన్ని లక్నో మేనేజ్‌మెంట్ విండీస్ నయా పేస్ సంచనలం షమార్ జోసఫ్‌తో భర్తీ చేసింది. వుడ్ స్థానాన్ని భర్తీ చేసుకున్నామనుకునే లోపే విల్లే రూపంలో లక్నోకు మరో షాక్ తగిలింది. విల్లే గత రెండు సీజన్ల పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు.