Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు . వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 24.75 కోట్లకు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
MS DHONI: విశాఖలో ధోనీ ధనాధన్.. సాగర తీరంలో మహీ మెరుపులు
అయితే ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో స్టార్క్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం ఏమీ లేదు. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్ హర్షిత్ రాణా విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్ పేసర్ పూర్తిగా తేలిపోయాడు. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచాడు.
నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 8 ఓవర్లలో 100 పరుగుల గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అతని కోసం పెట్టిన 24.75 కోట్లు మట్టిపాలే అంటూ ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు.