CSK VS RCB: చెన్నై వర్సెస్ బెంగళూరు.. ఏ జట్టు పై చేయి సాధిస్తుంది..?

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న చెన్నై ఇప్పటి వరకూ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే.. బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా కప్ అందుకోలేకపోయింది. అయినప్పటకీ ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేకపోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 05:30 PM IST

CSK VS RCB: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ కు ఇంకా మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మహాసంగ్రామం షురూ కానుంది, ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న చెన్నై ఇప్పటి వరకూ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే.. బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా కప్ అందుకోలేకపోయింది.

MS Dhoni: చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్ బై.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

అయినప్పటకీ ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేకపోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గత రికార్డులను పరిశీలిస్తే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై జట్టుకే మంచి రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు తలపడితే.. చెన్నై 20 సార్లు, ఆర్సీబీ 10 సార్లు గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక సొంత గడ్డ చెపాక్‌లో ఏ జట్టుపై అయినా చెన్నైదే పైచేయిగా ఉంది. చెపాక్‌ వేదికగా ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆ విజయం కూడా 2008లో వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా బెంగళూరు చెపాక్ స్టేడియంలో విజయాన్ని రుచిచూడలేకపోయింది.

ఏ విధంగా చూసినా ఆరంభ మ్యాచ్ లో చెన్నై జట్టునే ఫేవరెట్ గా చెబుతున్నారు. అయితే షార్ట్ ఫార్మాట్ లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.