Shreyas Iyer: కోల్‌కతాకు బిగ్‌ షాక్‌.. ఆరంభ మ్యాచ్‌లకు అయ్యర్ డౌట్

ముంబై, విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్‌లో శ్రేయస్ బాగానే ఆడాడు. 95 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో విలవిల్లాడాడు. నివేదికల ప్రకారం, అయ్యర్ వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 07:43 PM IST

Shreyas Iyer: ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావొచ్చొనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న అయ్యర్ మరోసారి వెన్నునొప్పి బారిన పడ్డాడు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం అయ్యర్ ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే కేకేఆర్ కు భారీ ఎదురుదెబ్బేనని చెప్పొవచ్చు.

BJP MP’S: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ సీఎంలు.. ఈసారైనా గెలుస్తారా..!

ముంబై, విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్‌లో శ్రేయస్ బాగానే ఆడాడు. 95 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో విలవిల్లాడాడు. నివేదికల ప్రకారం, అయ్యర్ వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీనికి గత ఏడాది సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే ఇప్పుడీ గాయం తిరగబెట్టిందని, దీంతో IPL 2024 ప్రారంభ మ్యాచ్‌లకు శ్రేయస్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. నిజానికి ఇంగ్లాండ్‌తో సిరీస్‌ సమయంలోనే గాయం కారణంగా దూరమవడం, ఫిట్‌నెస్ లేదంటూ ఎన్‌సీఎలో చేరడం చోటు చేసుకున్నాయి. అయితే ఈ గాయాన్ని సాకుగా చూపే అతను రంజీ మ్యాచ్‌లు ఆడలేదు. ఇదే సమయంలో అయ్యర్ ఫిట్‌నెస్ బాగానే ఉందంటూ ఎన్‌సీఎ రిపోర్ట్ ఇవ్వడంతో అతనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇషాన్‌ కిషన్‌తో పాటు శ్రేయాస్‌ను కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించింది.

ఆ తర్వాత మళ్లీ రంజీ బరిలోకి దిగిన అయ్యర్ కొన్ని ఇన్నింగ్స్‌లలో ఫెయిలైనప్పటకీ ఓవరాల్‌గా ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయం తిరగబెట్టడంతో ఇప్పుడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లలో ఆడడం సందిగ్ధంగా మారింది. కాగా ఇదే వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ మొత్తం 2023 సీజన్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో నితీష్ రాణాను జట్టు కెప్టెన్‌గా జట్టును నడిపించాడు.