IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఇండియాలోనే టోర్నీ..

షెడ్యూల్‌ను దశలవారీగా ప్రకటించాలని లీగ్‌ నిర్వహకులు యోచిస్తున్నారు. ముందు కొన్ని మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను ప్రకటించి, మిగతా మ్యాచ్‌లకు మరో తేదీన షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. 2019 ఎలక్షన్‌ ఇయర్‌లోనూ ఇలాగే జరిగింది.

  • Written By:
  • Updated On - February 20, 2024 / 08:35 PM IST

IPL 2024: క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ పై మేజర్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభ తేదీపై లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కీలక ప్రకటన చేశారు. మార్చి 22 నుంచి లీగ్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభమై, మే 26తో ముగుస్తుందని తెలుస్తోంది.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ..

షెడ్యూల్‌ను దశలవారీగా ప్రకటించాలని లీగ్‌ నిర్వహకులు యోచిస్తున్నారు. ముందు కొన్ని మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను ప్రకటించి, మిగతా మ్యాచ్‌లకు మరో తేదీన షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. 2019 ఎలక్షన్‌ ఇయర్‌లోనూ ఇలాగే జరిగింది. ఐపీఎల్‌ నిర్వహకులు ఈ సీజన్‌లోనూ పాత ఫార్ములానే వాడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్‌ కమీషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్ తెలిపారు. సీఈసీ నుంచి ఎన్నికల తేదీ ప్రకటన వెలువడిన వెంటనే లీగ్‌ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

ఎన్నికల ముందు ఒక దశలో.. ఎన్నికల తర్వాత మరో దశలో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటున్నట్టు చెప్పారు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ముందుగానే టోర్నీని ముగించనున్నారు. ఈ సారి డబుల్ హెడర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.