IPL 2024: ఐపీఎల్‌ జట్ల కొత్త టీం మెంబర్లు వీళ్లే.. ఎవరు ఇన్.. ఎవరు ఔట్..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 రిటెన్ష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, లక్నో, ఢిల్లీ సహా ఐపీఎల్ జట్లు ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాయి. కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా.. ఇంకొంతమందిని రిటైన్ చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్‌ వ్యవహరిస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 27, 2023 / 08:42 PM IST

IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 రిటెన్ష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, లక్నో, ఢిల్లీ సహా ఐపీఎల్ జట్లు ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాయి. కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా.. ఇంకొంతమందిని రిటైన్ చేసుకున్నాయి. మరికొంతమందిని జట్టులోకి తీసుకున్నాయి. చివరగా ఏ జట్టులో.. ఎవరు ఉన్నారు.. ఎవరు కొత్తగా చేరారు.. ఎవరు బయటకు వెళ్లారు వంటి వివరాలివి.

కోల్‌కతా నైట్ రైడర్స్..
కేకేఆర్ వ‌దులుకున్న ఆట‌గాళ్ల జాబితాలో ష‌కిబ్ అల్ హ‌స‌న్, లిట‌న్ దాస్, ఆర్యా దేశాయ్, డేవిడ్ వీస్, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్, మ‌న్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖెజ్రొలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూస‌న్, ఉమేశ్ యాద‌వ్, టిమ్ సౌథీ, జాన్స‌న్ ఛార్లెస్ లు ఉన్నారు. రిటెన్ష‌న్ లిస్ట్‌లో శ్రేయస్ అయ్య‌ర్, నితీశ్ రాణా, ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్, వెంక‌టేశ్ అయ్య‌ర్, ఆండ్రీ ర‌సెల్, సునీల్ న‌రైన్, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్‌, రింకూ సింగ్‌, వైభ‌వ్ అరోరా, సుయాశ్ శ‌ర్మ‌, జేస‌న్ రాయ్ కొనసాగుతున్నారు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌..
లక్నో సూపర్‌ జెయింట్స్‌ మొత్తంగా 8 మందిని విడుదల చేసి, 18 మందిని కొనసాగించింది. లక్నో గత సీజన్‌లో ఆడిన విధ్వంసకర ఆటగాళ్లందరినీ కొనసాగించింది. గత సీజన్‌ సందర్భంగా గాయపడిన కేఎల్‌ రాహుల్‌ను లక్నో మేనేజ్‌మెంట్‌ కెప్టెన్‌గా కొనసాగించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ వదిలిపెట్టిన ఆటగాల్లో జయదేవ్‌ ఉనద్కత్‌, డేనియల్‌ సామ్స్‌, మనన్‌ వోహ్రా, స్వప్నిల్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, అర్పిత్‌ గులేరియా, సుయాన్ష్‌ షేగ్డే, కరుణ్‌ నాయర్‌ లు ఉన్నారు. ఇక లక్నో నిలబెట్టుకున్న ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌, అయుష్‌ బదోని, కైల్‌ మేయర్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌, దీపక్‌ హుడా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవి భిష్ణోయ్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, కృనాల్‌ పాండ్యా, యుద్ద్‌వీర్‌ సింగ్‌, ప్రేరక్‌ మన్కడ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా, మార్క్‌ వుడ్‌, మయాంక్‌ యాదవ్‌, మోహిసిన్‌ ఖాన్‌‌లు ఉన్నారు. ఇందులో దేవదూత్ పాడిక్కాల్ రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా లక్నో జట్టులో చేరాడు.

ఢిల్లీ క్యాపిటల్స్..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్‌ వ్యవహరిస్తున్నారు. అతనితో పాటు మొత్తం 16 మంది ఆటగాళ్లను ఢిల్లీ రిటైన్ చేసుకోగా.. ముస్తాఫిజుర్ రెహమాన్, రిలీ రూసో సహా మొత్తం 11 మంది ఆటగాళ్లకు గుడ్ బై చెప్పింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించిన విదేశీ ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్ , రోవ్‌మన్ పావెల్ పేర్లు కూడా ఉన్నాయి. కాగా చేతన్ సకారియా, మనీష్ పాండే, కమలేష్ నాగర్‌కోటి, రిప్పల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమర్ ఖాన్, ప్రియమ్ గార్గ్‌ లకు కూడా స్వస్తి పలికింది. అదే సమయంలో రిషబ్ పంత్, పృథ్వీ షా, ఎన్రిక్ నార్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎన్గిడి, ఇషాంత్ శర్మ మొదలైన బడా పేయర్లను అంటిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లలో రిలే రుస్సీ, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, కమలేష్ నాగర్‌కోటి, రిపాల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్ ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్ల లిస్ట్ చూస్తే.. రిషబ్ పంత్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్వాల్, ఎన్రిక్ నోర్చే, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఉన్నారు.