IPL 2024: ఎవర్రా మీరంతా..? కోట్లు పెట్టి కొంటే టెస్ట్ బ్యాటింగా..

కేఎల్ రాహుల్ 39 ప‌రుగులు చేసి ఔట‌వ్వ‌గా.. డికాక్ 10, హుడా 8, స్టోయిన‌స్ 10 రన్స్‌కే వెనుదిరిగారు. దీంతో ల‌క్నో బ్యాటింగ్ తీరును క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది టీ20 మ్యాచ్‌లా లేద‌ని, టెస్ట్‌ను త‌ల‌పించింద‌ని అంటున్నారు.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 03:29 PM IST

IPL 2024: టీ ట్వంటీ ఫార్మాట్ అంటే బ్యాటింగ్‌లో మెరుపులు ఉండాల్సిందే. క్రీజులో ఉన్నంత సేపూ భారీ షాట్లు ఆడకుంటే మ్యాచ్ గెలవడం కష్టం. అలా ఆడతారనే నమ్మకం ఉన్న ఆటగాళ్లను జట్టు యాజమాన్యాలు ఎన్ని కోట్లైనా పోసి కొంటాయి. అయితే ఐపీఎల్‌లో కోట్లు పోసి కొంటే లక్నో ప్లేయర్స్ కొందరు టెస్ట్ బ్యాటింగ్ తరహాలో ఆడుతూ నిరాశ పరుస్తున్నారు. తాజాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్ పేలవంగా ఆడారు.

Hardik Pandya: ఇదేం కెప్టెన్సీ.. పాండ్యాపై గవాస్కర్ ఫైర్

కేఎల్ రాహుల్ 39 ప‌రుగులు చేసి ఔట‌వ్వ‌గా.. డికాక్ 10, హుడా 8, స్టోయిన‌స్ 10 రన్స్‌కే వెనుదిరిగారు. దీంతో ల‌క్నో బ్యాటింగ్ తీరును క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది టీ20 మ్యాచ్‌లా లేద‌ని, టెస్ట్‌ను త‌ల‌పించింద‌ని అంటున్నారు. కోట్లు పెట్టి కొన్న ఆట‌గాళ్లే ల‌క్నో కొంప ముంచుతున్నార‌ని అంటున్నారు. స్టోయిన‌స్ 9.20 కోట్లు, కేఎల్ రాహుల్ 17 కోట్లు, డికాక్ ఆరు కోట్లు, దీప‌క్ హుడా 5.75 కోట్లకు దక్కించుకుంది కేకేఆర్. ఇలా తక్కువ పరుగులు చేస్తున్న ఈ ఆట‌గాళ్లు చాలా మంది ఐదు కోట్ల‌కుపైనే ఐపీఎల్‌లో అమ్ముడుపోయారు.

కానీ అంద‌రూ క‌లిసి వంద ప‌రుగులు కూడా చేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు కురిపిస్తోన్నారు. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌‌పై విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది.