అప్ కమింగ్ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ముగిసిన వెంటనే ఐపీఎల్ 2024 కార్యచరణను బీసీసీఐ ప్రారంభించనుంది. డిసెంబర్ 15-19 మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ 2024కు సంబంధించిన ట్రేడింగ్ విండో ఓపెన్ అవ్వగా.. ముంబై ఇండియన్స్ వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 10 ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. భారీ ధర పలికిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, హర్షల్ పటేల్, ఆండ్రీ రస్సెల్, పృథ్వీ షా వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసినట్లు తెలుస్తోంది.
ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నుండి 16.25 కోట్లు పలికిన బెన్ స్టోక్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుండి 7.5 కోట్ల పలికిన పృథ్వీ షా, గుజరాత్ టైటాన్స్ నుండి 3.2 కోట్లు పలికిన యశ్ దయాల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ నుండి 12 కోట్లు ధర పలికిన ఆండ్రూ రస్సెల్, లక్నో సూపర్ జెయింట్స్ నుండి 10 కోట్లు పలికిన ఆవేశ్ ఖాన్, ముంబై ఇండియన్స్ నుండి 8 కోట్లు పలికిన జోఫ్రా ఆర్చర్, పంజాబ్ కింగ్స్ నుండి 5.2 కోట్లు పలికిన రాహుల్ చాహర్, రాజస్థాన్ రాయల్స్ నుండి 5.75 కోట్లు పలికిన జాసన్ హోల్డర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుండి 10 కోట్లు పలికిన హర్షల్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుండి 13.25 కోట్లు పలికిన హ్యారీ బ్రూక్ ళ్లను, తమ ఫ్రాంచైజీలు వదులుకోనున్నట్టు తెలుస్తోంది.