Gautam Gambhir: ఐపీఎల్ అంటే పార్టీలు కాదు.. ఆటపై ఫోకస్ పెట్టాలని గంభీర్ వార్నింగ్

గతంలో ఆ జట్టు సారథిగా 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. కేకేఆర్ మెంటార్‌గా జట్టుకు సేవలందించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు. తాజాగా తమ ఆటగాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 01:06 PM IST

Gautam Gambhir: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్, మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదని.. ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. గత సీజన్‌ వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్.. ఈ ఏడాది కేకేఆర్‌కు మారాడు. గతంలో ఆ జట్టు సారథిగా 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు.

YCP Tickets : వైసీపీ సమన్వయకర్తలు ఉంటారా ? ఊడతారా ? నేతలకు సర్వేల టెన్షన్

కేకేఆర్ మెంటార్‌గా జట్టుకు సేవలందించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు. తాజాగా తమ ఆటగాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదని మా ఆటగాళ్లకు తొలి రోజే స్పష్టం చేశానని చెప్పాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్లు, మ్యాచ్‌ల తర్వాత చేసుకునే పార్టీలు కాదనీ, పోటాపోటీగా సాగే క్రికెట్ టోర్నీ అన్నాడు. ప్రపంచంలోనే క్రికెట్ లీగ్‌లన్నింటిలో నూ ఈ టోర్నీ మాత్రమే సరైన దిశలో వెళ్తోందని వ్యాఖ్యానించాడు.

ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా విజయవంతంగా సాగుతున్న లీగ్ ఇదనీ, అందుకు తగ్గట్లుగానే మైదానంలో మన ఆటతీరు ఉండాలన్నాడు. ముఖ్యంగా అభిమానులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారనీ, వారి పట్ల నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.