కొత్త ఐపీఎల్ (New IPL) సీజన్ కు కొత్త జెర్సీ, కొత్త పేరుతో వచ్చినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Bangalore) తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతుల్లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు తమ సొంతగడ్డపై బెంగళూరులో ఆ టీమ్ పంజాబ్ కింగ్స్ తో రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. మరోసారి అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి.
ఆర్సీబీ (RCB) పై పంజాబ్ కింగ్స్ దే పైచేయిగా ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ ఆర్సీబీపై 17 విజయాలు సాధించింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 14 మ్యాచ్ లలోనే గెలిచింది. ఈసారి ఐపీఎల్లో తొలి రౌండ్ మ్యాచ్ లు పూర్తయిన తర్వాత ఆర్సీబీ 9, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మూడోస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో గత రికార్డులు చూసినా, ప్రస్తుత ఫామ్ చూసినా.. ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. సొంత మైదానంలో ఆడుతుండటమే ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.