KKR : రింకూ విషయంలో కోల్ కత్తా దే తప్పా ?

పించ్ హిట్టర్ (Pinch Hitter) రింకూ సింగ్ కెరీర్ తో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్ ఆడుకుందా...అంటే అవుననే విమర్శలు వస్తున్నాయి. అతనికి వరల్డ్ కప్ మెయిన్ టీంలో చోటు దక్కక పోవడానికి కారణం కోల్ కత్తా జట్టేనని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

 

 

పించ్ హిట్టర్ (Pinch Hitter) రింకూ సింగ్ కెరీర్ తో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్ ఆడుకుందా…అంటే అవుననే విమర్శలు వస్తున్నాయి. అతనికి వరల్డ్ కప్ మెయిన్ టీంలో చోటు దక్కక పోవడానికి కారణం కోల్ కత్తా జట్టేనని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ కు దిగే రింకూను బ్యాటింగ్ ఆర్డర్ లో మరీ వెనక్కి పంపించారు.దీంతో అతడికి కనీసం 10 బంతులు ఆడే ఛాన్స్ కూడా రావట్లేదు. రింకూను ముందు పంపకుండా కేకేఆర్ (KKR) తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బ్యాటింగ్ ఆర్డర్ లో పైన ఆడే సత్తా ఉన్నప్పటికీ రింకూను చివర దింపుతున్నారు. ఇలా ప్రతి మ్యాచ్ ఆఖర్లో పంపిస్తుండటం అతడి కెరీర్ కూడా ఇబ్బందికరమేనని ముందే పలువురు హెచ్చరించారు. అనుకున్నట్టే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సెలక్షన్ లో దాని ప్రభావం కనిపించింది. ఈ కారణంగానే ఈ యంగ్ ప్లేయర్ రిజర్వ్ ప్లేయర్స్ జాబితాకు పరిమితం అయ్యాడని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.