RCB కెప్టెన్సీ అతనికే వేలంలో కొనడమే మిగిలిందా ?

ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా మారిపోనుంది. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ రూల్స్ ప్రకటించకపోయినా రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై ఫ్రాంచైజీలు క్లారిటీ తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వేలంలో ఖచ్చితంగా తీసుకుంటామనుకున్న ప్లేయర్స్ లో కొందరికి కెప్టెన్సీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 04:01 PM IST

ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా మారిపోనుంది. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ రూల్స్ ప్రకటించకపోయినా రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై ఫ్రాంచైజీలు క్లారిటీ తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వేలంలో ఖచ్చితంగా తీసుకుంటామనుకున్న ప్లేయర్స్ లో కొందరికి కెప్టెన్సీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతోంది. డుప్లెసిస్ ను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త సారథిగా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్టే. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి బయటకొచ్చేందుకు నిర్ణయించుకున్న రాహుల్ ను వేలంలో దక్కించుకోవాలని ఆర్సీబీ ఇప్పటికే డిసైడయింది.

అతనికే జట్టు పగ్గాలు అప్పగించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. వేలంలో అతన్ని కొనుగోలు చేయడమే మిగిలిందని జట్టు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా రాహుల్ కెప్టెన్ గా మంచి ఛాయిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు రాహుల్ హోమ్ కమింగ్ అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. 2013లో ఆర్సీబీ టీమ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మధ్యలో సన్ రైజర్స్ కు వెళ్ళినా మళ్లీ 2016లో బెంగళూరు టీంకు ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ కెరీర్ లో 132 మ్యాచ్ లు ఆడి 4 వేలకు పైగా పరుగులు చేశాడు. కెప్టెన్సీగా కూడా అతనికి మంచి రికార్డే ఉండడంతో ఆర్సీబీ రాహుల్ ను తీసుకునేందుకు రెడీ అయింది.