మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చాహల్ కు రీఎంట్రీ ఛాన్సుందా ?

కౌంటీ క్రికెట్ లో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ దుమ్మురేపుతున్నాడు. తన స్పిన్ మ్యాజిక్ తో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - September 12, 2024 / 06:40 PM IST

కౌంటీ క్రికెట్ లో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ దుమ్మురేపుతున్నాడు. తన స్పిన్ మ్యాజిక్ తో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. తాజాగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్‌, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్‌ డెర్బీషైర్‌పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవలే కౌంటీల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్న రికార్డును కూడా అందుకున్నాడు. కాగా నార్తాంప్టన్ షైర్ విజయంలో కీలకపాత్ర పోషించిన చాహల్ ఇప్పుడు టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుతం భారత స్పిన్ విభాగంలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా పోటీపడుతున్నారు. టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న అశ్విన్ కు తోడుగా కుల్దీప్, అక్షర్ పటేల్ లలో ఎవరో ఒకరికే సెలక్టర్లు చోటు కల్పిస్తున్నారు. చైనామన్ బౌలర్ కావడం కుల్దీప్ కు అడ్వాంటేజ్ అయితే బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించడం అక్షర్ పటేల్ కు కలిసొస్తోంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా అప్పుడప్పుడు బ్యాట్ తో రాణిస్తుండడం చాహల్ కు మైనస్ గా మారింది. వన్డేల్లోనూ స్పిన్నర్ల కోటా రేసులో చాహల్ వెనుకబడిపోయాడు. ప్రస్తుతం టీ ట్వంటీల వరకే అతన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి తాజాగా కౌంటీల్లో ప్రదర్శనతో సెలక్టర్లు చాహల్ ను కరుణిస్తారో లేదో చూడాలి.