టార్గెట్ ఛేజింగ్‌లో కంగారుపడినా.. ఆస్ట్రేలియా ఎట్టకేలకు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ 48 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62, స్టీవ్ స్మిత్ 30 పరుగులతో మెరవడంతో.. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై కష్టపడి గెలిచింది. ఫలితంగా ఎనిమిదోసారి మెగా ఈవెంట్ టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 రన్స్‌కు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ 116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101, హెన్రిచ్ క్లాసెన్ 48 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులతో చెలరేగారు. తర్వాత ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 స్కోరు చేసింది. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్.. ఇండియాతో తలపడనుంది. అయితే, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఇమ్రాన్ తాహిర్ తమ జట్టు ఓటమిపై తీవ్రంగా స్పంచించాడు. బావుమా కెప్టెన్సీ అస్సలు బాలేదని, ఒక గేమ్ ప్లాన్ లేకుండా బరిలో దిగారని తప్పుబట్టాడు. వరల్డ్ కప్ 2023 లో అద్భుతమైన జట్టుగా ప్రదర్శన చేసి, ఇంపార్టెంట్ మ్యాచులో ఇలా చేతులెత్తేయడం తమ దేశ పౌరులతో పాటు, తనను కూడా కంటతడి పెట్టించిందని, తాహిర్ భావోద్వేగానికి లోనయ్యాడు.