Team India: ముక్కీ మూలిగి 30 ఓపెనర్ల ఖలేజా ఇంతేనా?

క్రికెట్ లో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన భారత జట్టు కరీబియన్ దీవుల్లో తమదైన ఆటతీరును ప్రదర్శించేందుకు నానా తంటాలు పడుతోంది.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 04:28 PM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా తడబడింది. క్రికెట్ లో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన భారత జట్టు కరీబియన్ దీవుల్లో సత్తా చాటేందుకు నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగులే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. తొలి టీ20 మ్యాచ్‌లో 145 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా 2వ మ్యాచ్‌లో 152 పరుగులకే చేతులెత్తేసి పరాజయం పాలైంది. అంటే బ్యాట్స్‌మెన్‌లకు పేరుగాంచిన భారత జట్టు.. పరుగులు సాధించలేక ఘెరంగా విఫలమవుతోంది.

ముఖ్యంగా ఓపెనింగ్ జోడీలు శుభారంభం విఫలమవడం ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది. టీమిండియాకు ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమవుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. అంటే గిల్, ఇషాన్‌లు చివరి 8 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. తొలి వికెట్‌కు కనీసం 30 పరుగుల భాగస్వామ్యం కూడా చేయలేదు. అంటే టీమ్ ఇండియా ఇద్దరు ఓపెనర్లు పవర్‌ప్లేలో సందడి చేయడంలో విఫలమవుతున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ త్వరగానే వికెట్లు చేజార్చుకోవడం టీమ్ ఇండియాలో ఆందోళనను పెంచింది. అయితే మూడో టీ20 మ్యాచ్‌లోనైనా ఇషాన్, గిల్ భారత జట్టుకు శుభారంభం అందిస్తారో లేదో చూడాలి.