Ishan Kishan: కష్టాలు తెచ్చిపెట్టిన కిషన్ కీపింగ్.. ఆసీస్ విజయానికి అదే కారణం..

ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. అతని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ మలుపు తిరిగింది. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ క్రీజ్ ధాటి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవడంతో మిస్సై కీపర్ చేతిలో పడింది.

  • Written By:
  • Updated On - November 29, 2023 / 05:28 PM IST

Ishan Kishan: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ అద్భుతం చేసింది. అసాధారణ ప్రదర్శనతో కొండత లక్ష్యాన్ని చేధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్‌గా అజేయ శతకంతో చెలరేగాడు. దీంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది.

Deepak Chahar: దీపక్ చాహర్ దిగుతున్నాడు.. రెండు టీ20లకు జట్టు ఇదే..!

అతని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ మలుపు తిరిగింది. ఆసీస్ విజయానికి 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ క్రీజ్ ధాటి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవడంతో మిస్సై కీపర్ చేతిలో పడింది. బంతిని అందుకున్న వెంటనే ఇషాన్ కిషన్ స్టంపింగ్ చేసి గట్టిగా అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. థర్డ్ అంపైర్ మాథ్యూ వేడ్‌ను నాటౌట్‌గా తేల్చుతూ.. ఇషాన్ కిషన్ తప్పిదాన్ని పసిగట్టాడు. బంతి అందుకునే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఇషాన్ కిషన్.. స్టంప్స్ కన్నా ముందే బంతిని అందుకున్నాడు. అతని గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు రావాడాన్ని గుర్తించిన థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఈ ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకున్న మాథ్యూ వేడ్ భారీ సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతిని వికెట్ల వెనుకాల అందుకోవడంలో ఇషాన్ కిషన్ విఫలమవడంతో బైస్ రూపంలో 4 పరుగులు వచ్చాయి.

చివరి ఓవర్లలో 21 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌ను మ్యాక్స్‌వెల్ చీల్చి చెండాడాడు. ఇషాన్ కిషన్ అప్పీల్ చేయకపోయినా.. అత్యుత్సాహంతో స్టంప్స్ కన్నా ముందే బంతిని అందుకోకపోయినా.. ఆసీస్‌కు ఫ్రీ హిట్ వచ్చేది కాదు. అంతేకాకుండా ఒక బంతి అదనంగా వేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 30 ప్లస్ రన్స్ చేయాల్సి వచ్చి భారత విజయం లాంఛనమయ్యేది. కానీ ఇషాన్ అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగింది. ఐసీసీ రూల్స్ ప్రకారం బౌలర్ బంతి వేసిన తర్వాత వికెట్ కీపర్ స్టంప్స్ వెనకాలే బంతిని అందుకోవాలి. గ్లవ్‌లో కొంచెం భాగం ముందుకు వచ్చినా దాన్ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించొచ్చు.