KKR : పదేళ్లుగా లీగ్ స్టేజ్ దాటలేదు.. ఇదెక్కడి టీమ్ రా బాబూ

ఐపీఎల్ ప్రారంభమై 17 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని జట్లు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్‌ (IPL) కప్పును టచ్‌ చేయలేదు. అయితే.. ఐపీఎల్‌ కప్పు కాదు కదా.. గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్‌కు వెళ్లని టీమ్‌ ఒకటుంది. అదే పంజాబ్‌ కింగ్స్‌... 2015 నుంచి ఈ సీజన్‌ వరకు పంజాబ్‌ కింగ్స్‌ కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.

ఐపీఎల్ ప్రారంభమై 17 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని జట్లు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్‌ (IPL) కప్పును టచ్‌ చేయలేదు. అయితే.. ఐపీఎల్‌ కప్పు కాదు కదా.. గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్‌కు వెళ్లని టీమ్‌ ఒకటుంది. అదే పంజాబ్‌ కింగ్స్‌… 2015 నుంచి ఈ సీజన్‌ వరకు పంజాబ్‌ కింగ్స్‌ కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఆర్సీబీ (RCB) తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ సీజన్ లో కూడా పంజాబ్ కనీసం లీగ్ స్టేజ్ దాటలేక పోయింది.

ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) కేవలం 4 విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే.. చివరి సారిగా 2014లో ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆ తర్వాత వరుసగా పదేళ్ల పాటు ప్లే ఆఫ్స్‌కు వెళ్లని ఏకైక టీమ్‌గా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందులో 2014లో టేబుల్‌ టాపర్‌గా ఉండి, ఫైనల్స్‌ కూడా ఆడింది. కానీ, ఫైనల్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడిపోయి.. రన్నరప్‌గా మిగిలింది.

ఇదిలా ఉంటే ఈ 16 ఏళ్లలో కేవలం రెండు టీమ్స్‌ మాత్రమే ఐపీఎల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings), ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) డామినేట్‌ చేశాయి. 16 ఏళ్లలో 10 టైటిల్స్‌ ఈ రెండు టీమ్స్‌ వద్దే ఉన్నాయి. చెరో ఐదుసార్లు కప్పుకొట్టి.. ఐపీఎల్‌ను శాసిస్తున్నాయి. వీటి తర్వాత కేకేఆర్‌ (KKR) రెండు సార్లు టైటిల్ గెలిచింది. ఇవి కాకుండా రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) కూడా గతంలో ఒక్కసారి ట్రోఫీలు గెలిచాయి.