ROHIT SHARMA: ఒక్క మ్యాచ్‌తో అంతా మారిపోతుంది: రోహిత్ శర్మ

మాజీ ఆటగాళ్లు సూచించినట్లుగా, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని స్వార్థపూరితంగా ఉండాలా అంటూ అడిగిన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో వ్యంగ్యంగానే సమాధానమిచ్చారు. జట్టును మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటానని రోహిత్ చెప్పారు.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 06:48 PM IST

ROHIT SHARMA: తాను చెడ్డ కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడారు. గ్రౌండ్‌లో బౌండరీలు బాదే రోహిత్ పాత్రికేయులకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. మాజీ ఆటగాళ్లు సూచించినట్లుగా, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని స్వార్థపూరితంగా ఉండాలా అంటూ అడిగిన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో వ్యంగ్యంగానే సమాధానమిచ్చారు. జట్టును మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటానని రోహిత్ చెప్పారు.

స్కోర్‌బోర్డ్ సున్నా నుంచి మొదలవుతుందని, ఆ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని అన్నారు. చివరి గేమ్‌ పవర్ ప్లేలో ఒత్తిడికి గురయ్యామని, మూడు వికెట్లు కోల్పోయామని చెప్పొకొచ్చాడు. అందుకే ఆట తీరు మార్చవలసి వచ్చిందని, జట్టుకు ఏమి అవసరమో బ్యాట్స్‌మెన్‌గా దానిపైనే తన దృష్టి ఉంటుందని తెలిపారు. ఆట పరిస్థితిని, స్కోర్‌బోర్డ్‌ను దృష్టిలో ఉంచుకుని, సమయానుకూలంగా కొన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తామని, కొన్నిసార్లు అవి పని చేస్తాయని, మరికొన్ని సార్లు పని చేయవన్నారు. అలాంటప్పుడు అన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మనం ఎలాంటి ప్రయత్నం చేసినా అది జట్టు ప్రయోజనాల కోసమేనని, ఆ విషయం తనకు తెలుసని అన్నారు. ఒక చెడ్డ ఆటగాడిగా, కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలన్నారు.

మ్యాచ్-డే రోజు మీరు ఏమి చేస్తారని అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధామిస్తూ.. రేపు మనం ఏం చేయబోతున్నామో చెప్పదలచుకోలేదన్నారు. కొన్ని సమయాల్లో మైదానం అనూహ్యంగా మారుతుందన్నారు. బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందన్నారు. ప్రత్యర్థిని గడగడలాడిస్తున్న టాప్ స్పెల్‌ను చూడవచ్చని, బౌలర్లు బంతిని సరైన ఏరియాలో వేస్తే కష్టమేనని చెప్పారు. బౌలర్లు, స్పిన్నర్లు, బ్యాటర్లకు ఇక్కడ ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు.