ప్రస్తుతం జైశ్వాల్ 350 బంతుల్లో 143 పరుగులతో, విరాట్ కోహ్లి 96 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వీ టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్ గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2016లో), పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్గానూ జైశ్వాల్ చరిత్రకెక్కాడు.
ఇక విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన భారత క్రికెటర్గా కూడా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్ అలీ 1959లో ఇంగ్లండ్ గడ్డపై, 1976లో సురిందర్ అమర్ నాథ్ న్యూజిలాండ్ ఆక్లాండ్ వేదికగా, 1992లో ప్రవీణ్ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్ వేదికగా, 1996లో సౌరవ్ గంగూలీ ఇంగ్లండ్ మీద, 2001లో సౌతాఫ్రికాపై సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు.
అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్గా జైశ్వాల్ 21 ఏళ్ల 196 రోజులతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్ లు ఉన్నారు. ఇక 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. రీసెంట్గా చూసుకుంటే జైశ్వాల్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ 2021లో న్యూజిలాండ్ మీద అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన క్రికెటర్గా నిలిచాడు.