Jasprit Bumrah: గాయం కారణంగా దాదాపు 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ప్రస్తుతం ఐర్లాండ్‌తో బరిలోకి దిగనున్నాడు. అతని కెప్టెన్సీతోనే మొదటి సిరీస్‌లో తన పేరును చరిత్ర పుస్తకాలలో లిఖించేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా సరిగ్గా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు ఐర్లాండ్‌తో బరిలోకి దిగి తన కెప్టెన్సీ తొలి సిరీస్‌లోనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాడు.
ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బుమ్రా నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్‌కు బయలుదేరింది. ప్రస్తుత T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లతో సహా చాలా మంది రెగ్యులర్ ప్లేయర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. అలాగే పలువురు సీనియర్లు గైర్హాజరు కావడంతో సెలక్టర్లు బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించారు. టీ20లో ఇప్పటివరకు భారత్ 10 మంది కెప్టెన్లను చేసింది. వీరిలో 9 మంది ఫ్రంట్‌లైన్ బ్యాట్స్‌మెన్ కాగా, ఈ జాబితాలో పాండ్యా ఒక్కడే ఆల్‌రౌండర్.
ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న బుమ్రా.. భారత జట్టును తన స్టైల్‌లో నడిపించే తొలి బౌలర్‌గా రికార్డులకెక్కనున్నాడు. 2022లో టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. కపిల్ దేవ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన తొలి పేసర్‌గా నిలిచాడు.