HARDHIK PANDYA: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడంతోనే ఐపీఎల్ 17వ సీజన్‌పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెంచాయి. డిసెంబర్‌లో వేలం ముగియడంతో పలు మార్పులతో తమ తమ జట్లను రెడీ చేసుకున్న ఫ్రాంచైజీలు ఇప్పుడు సన్నద్ధతపై దృష్టి సారించాయి. అదే సమయంలో ఆటగాళ్ళ గాయాలు, అందుబాటులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఖరీదైన ట్రేడింగ్ డీల్‌తో అందరికీ ఆకట్టుకుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకోవడమే గాక.. కెప్టెన్‌గానూ నియమించింది. ఐదుసార్లు తమను చాంపియన్‌గా నిలిపిన భారత జట్టు సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.
YS Sharmila : ఈ నెల 4న కాంగ్రెస్ లోకి షర్మిల
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించడం ద్వారా తమ బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీని కోసం దాదాపు 100 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. అయితే వన్డే ప్రపంచకప్ సమయంలో గాయపడిన పాండ్యా ఇప్పటికీ కోలుకోలేదు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ పాండ్యా దూరమైతే అతడి స్థానంలో ఎవరు సారథిగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా ప్రకటించాలని అభిమానులు ఆశిస్తున్నా.. తాను ఆటగాడిగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నట్లు హిట్‌మ్యాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అలాగే తనను తప్పించిన తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడానికి అతను సుముఖత చూపించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేదా టీ ట్వంటీల్లో భారత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశముంది. కానీ పాండ్యా తరహాలోనే సూర్యకుమార్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు.
అతను ఎప్పటి వరకూ జట్టులోకి వస్తాడనేది కీలకం. దీంతో బుమ్రానే ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ అవుతాడని పలువురు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచీ బుమ్రా ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీనియర్ ప్లేయర్‌గా డ్రెస్సింగ్‌రూం వాతావరణం గురించి అతడికి బాగా తెలుసు. గతంలో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా బూమ్రాకు కలిసొచ్చే అంశం. టెస్టు జట్టుతో పాటు ఐర్లాండ్ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన బూమ్రావైపే ఫ్రాంచైజీ యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.