Joe Root: జంకు బొంకు లేని ఆట కొడితే భయపడాల్సిందే అందుకే కోహ్లీతో పోల్చేది

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ అజేయమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్ 393 పరుగులు చేయగలిగింది.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 04:54 PM IST

అయితే రూట్ తన సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ లెజెండ్ అయిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఎలా అంటే ఈ మ్యాచ్‌కు ముందు జో రూట్, బ్రాడ్‌మాన్ 29 టెస్ట్ సెంచరీలతో సమానంగా ఉండేవారు. ఇక శుక్రవారం చేసిన సెంచరీతో రూట్ తన 30వ శతకాన్ని పూర్తి చేసుకుని బ్రాడ్‌మాన్‌ని అధిగమించాడు. ఇదే కాక రూట్ ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 30 సెంచరీల మార్క్‌ని అందుకున్న ప్లేయర్‌గా కూడా అవతరించాడు. అంతకముందు ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 30 శతకాలు చేసిన రికార్డు.. ఆ టీమ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ 239 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధిస్తే, రూట్ తన మాజీ కెప్టెన్ కంటే వేగంగా 231 ఇన్నింగ్స్‌ల్లోనే 30వ సెంచరీ చేశాడు. ఇలా రూట్ తన 30వ సెంచరీలో సర్ బ్రాడ్‌మాన్, అలెస్టర్ కుక్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసి తనదైన మార్క్ చూపించాడు.