ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. దీనిలో 16 సెంచరీలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌కే దక్కుతుంది. అలాగే ఐదోసారి క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గానూ రికార్డు సాధించాడు.