ద్రవిడ్ రికార్డు బద్దలు జో రూట్ అరుదైన ఘనత

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మార్చిన మరోసారి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 01:15 PM IST

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మార్చిన మరోసారి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. టెస్ట్ ఫార్మాట్ అంటే చాలు పరుగుల వరద పారించే రూట్ శ్రీలంకపై తొలి టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రూట్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా జో రూట్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా .. చంద్రపాల్ , రూట్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలెన్ బోర్డర్ , రాహుల్ ద్రవిడ్ , రికీ పాంటింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే మాంచెస్టర్ స్టేడియంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ప్లేయర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో రూట్ , ఇయాన్ బెల్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కాగా తొలి టెస్టులో అయిదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ లో బోణీ కొట్టింది.