Wasim Akram: హైదరాబాద్ బిర్యానీ వర్సెస్ కరాచీ బిర్యానీ.. ఏది బెస్ట్..?

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పర్యటిస్తుంది. పది రోజులుగా ఇక్కడే బస చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ జట్టు సభ్యులు జువెల్ ఆఫ్ నిజాంలో హైదరాబాద్ బిర్యానీ తిన్నారు.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 09:06 PM IST

Wasim Akram: హైదరాబాద్ బిర్యానీ.. బిర్యానీ కాదంట.. అది పులావ్ అంట.. బిర్యానీ అంటే కరాచీ బిర్యానీ అంట.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. వీడియో సాక్ష్యంగా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పర్యటిస్తుంది.

పది రోజులుగా ఇక్కడే బస చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ జట్టు సభ్యులు జువెల్ ఆఫ్ నిజాంలో హైదరాబాద్ బిర్యానీ తిన్నారు. దీనికి రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ వారం రోజులుగా చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ లకు కామెంటరీ ఇస్తున్న వసీం అక్రమ్.. హైదరాబాద్ బిర్యానీపై వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ బిర్యానీ.. బిర్యానీనే కాదు.. అది పులావ్.. మెత్తగా ఉంటుంది.. అదే కరాచీ బిర్యానీ పొడిగా.. ముత్యాల్లా ఉంటుంది.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన బిర్యానీ అంటే కరాచీ బిర్యానీ అంటూ వ్యాఖ్యానించారు వసీం అక్రమ్. ఈ విషయంపై హైదరాబాద్ ఫ్యాన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తూ, వసీంకు బెస్ట్ బిర్యానీ దొరికే ప్లేసెస్ ను టాగ్ చేస్తున్నారు.