Rohit Sharma: రోహిత్‌పై కన్నేసిన సన్ రైజర్స్.. కావ్య పాప ఆఫర్ ఏంటో తెలుసా ?

హిట్ మ్యాన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 06:42 PM IST

Rohit Sharma: రోహిత్‌ శర్మకు సంబంధించిన మరో వార్త వైరల్‌గా మారింది. ముంబై ఫ్రాంచైజీపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం. హిట్ మ్యాన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.

CHIRANJEEVI-PAWAN KALYAN: తమ్ముడి కోసం అన్న.. పవన్‌కు చిరు మెగా విరాళం.. ఫొటోలు..

టైటిల్ గెలిచిన జట్టులో రోహిత్ ప్లేయర్‌గా కూడా ఉన్నాడు. తెలుగు టీమ్‌పై ఉన్న ఈ సెంటిమెంట్‌తో రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ నుంచి అనుమతి లేకుండా ఏ ఆటగాడు ఇతర ఫ్రాంచైజీలతో చర్చించకూడదు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా, 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్‌ తరఫున రోహిత్ 45 మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ నియమించడంతో అసలు రచ్చ మొదలైంది.

రోహిత్‌కు మద్దతుగా నిలుస్తూ ముంబై ఫ్రాంచైజీని, హార్దిక్ పాండ్యను హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్టేడియంలో, బయటా హార్దిక్‌ను హేళన చేస్తున్నారు. అంతేగాక ముంబై ఇండియన్స్ జట్టు రెండు వర్గాలు చీలిపోయిందనే కథనాలు కూడా వచ్చాయి. కాగా ఈ ఎఫెక్ట్‌తోనే జట్టు వరుస ఓటములు చవి చూసిందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ఢిల్లీపై గెలిచి ఎట్టకేలకు ముంబై తొలి విజయాన్ని అందుకుంది.