Kavya: ఎస్‌ఆర్‌హెచ్ ( SRH) గెలిచింది…. కావ్య పాప నవ్వింది….!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే గొప్పేముంది అంటారా...? ఇక్కడ న్యూస్ సన్‌రైజర్స్ గెలవడం కాదు.. కావ్య పాప నవ్వడం... అవును ఐపీఎల్‌కే స్పెషల్ ఎట్రాక్షన్ అయిన కావ్యామారన్ ముఖం ఈ విజయంతో ఒక్కసారిగా వెలిగిపోయింది. కావ్య ఆనందమే ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్.

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 08:23 AM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే గొప్పేముంది అంటారా…? ఇక్కడ న్యూస్ సన్‌రైజర్స్ గెలవడం కాదు.. కావ్య పాప నవ్వడం… అవును ఐపీఎల్‌కే స్పెషల్ ఎట్రాక్షన్ అయిన కావ్యామారన్ ముఖం ఈ విజయంతో ఒక్కసారిగా వెలిగిపోయింది. కావ్య ఆనందమే ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్… ఐపీఎల్ గురించి కాస్తో కూస్తో తెలిసిన వారెవరికైనా కావ్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ ప్రతి మ్యాచ్‌కు కావ్య సన్‌రైజర్స్ జెర్సీలోనే హాజరవుతుంది. వీఐపీ బాక్సులో కూర్చుని టీమ్‌ను ఎంకరేజ్ చేస్తుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ బౌండరీ బాదినా, సిక్సు బాదినా కావ్య సంతోషంతో గంతులేస్తుంది. వికెట్ పడినా అదే జోరు… అంతెందుకు బాల్ రీప్లే కంటే ముందే స్టేడియంలో కెమెరాలన్నీ ఒక్కసారిగా కావ్యవైపు తిరుగుతాయి. ఆ జోష్‌ను క్యాప్చర్ చేస్తాయి. నిజానికి ఓ కెమెరా ఎప్పుడూ ఈ బ్యూటీపైనే పెట్టి ఉంటుందనుకుంటా…! ఇక టీమ్ గెలిస్తే కావ్య చేసే సందడి అంతా ఇంతా కాదు… ఓడిపోతే మొహం చిన్నబోతుంది. గెలిస్తే ఆనందంతో గంతులేస్తుంది. ఎస్ఆర్‌హెచ్‌కు ఎంతమంది ఫ్యాన్సున్నారో కానీ కావ్యకు మాత్రం అంతకంటే ఎక్కువమంది అభిమానులే ఉన్నారని చెప్పాలి. ఓ రకంగా సన్‌రైజర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఈ అందం.

ప్రతిసారీ ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయినప్పుడల్లా అయ్యో మ్యాచ్ పోయిందన్న బాధకన్నా కావ్య పాప బాధపడిందనే ఫ్యాన్స్ హర్టవుతారు. అందుకే కేవలం ఆమె కోసమైనా మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. రెండో మ్యాచ్‌లో లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ తక్కువ పరుగులకే అవుటైనప్పుడు కావ్య వేసిన చిందులు వైరల్ అయ్యాయి కూడా. ఒక్క దెబ్బకు అందరి అటెన్షన్ క్యాప్చర్ చేసింది ఈ అందం. ఈ సీజన్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయినప్పుడు కావ్య డీలా పడిపోయింది. కానీ పంజాబ్‌పై గెలవగానే మొహం సంతోషంతో దీపావళి చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో కావ్య ఫ్యాన్స్ కూడా తెగ సంతోషపడిపోయారు. మొదట బౌలర్లు వికెట్లు తీస్తున్నప్పుడు కావ్య చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. అయితే పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ దూకుడుగా ఆడుతున్న సమయంలో మాత్రం కాస్త టెన్షన్‌గా కనిపించింది. అయితే మనవాళ్లు మొదట్లో భయపెట్టినా తర్వాత పరుగుల వరద పారించడంతో ఇక కావ్యను ఆపేవారే లేకపోయారు. చిందులే చిందులు. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో కావ్య నిలిచింది. కావ్య సంతోషంగా కేరింతలు కొడుతున్న వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. సన్‌రైజర్స్ గెలిచిందన్న దానికంటే కావ్య ఆనందమే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

సన్‌ గ్రూప్ వ్యవస్థాపకులు కళానిధి మారన్ ఏకైక కుమార్తె ఈ కావ్యమారన్. 1992 ఆగస్టులో కావ్య జన్మించింది. తల్లి, తండ్రి ఇద్దరూ ప్రముఖ వ్యాపారవేత్తలు. దేశంలోనే ఎక్కువ జీతం తీసుకునే మహిళా సీఈఓ ఆమె తల్లి. ఇక తాత మురుసోలి మారన్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తమిళ రాజకీయ దిగ్గజం కరుణానిధి ఆమెకు తాత వరుస. ఎంబీఏ చేసిన వెంటనే వారసత్వంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించింది కావ్య. సన్ మ్యూజిక్, సన్ టీవీ వ్యవహారాలు చూసుకుంది. 2018లో ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ను సన్ గ్రూప్ సొంతం చేసుకుంది. మాములుగానే క్రికెట్ అభిమాని అయిన కావ్య తొందరగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈఓగా బాధ్యతలు తీసుకుంది. ఐపీఎల్ వేలం సమయంలో కావ్య అంతా తానై చక్కబెట్టింది. గతంలో జట్టు ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఈసారి మంచి ఆటగాళ్లను సెలక్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఇంత మంది అభిమానులను సంపాదించుకున్న కావ్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఖాళీ సమయాల్లో మ్యూజిక్ వినడం, ట్రావెల్ చేయడం ఆమె హాబీలు.