KKR Vs SRH: ఈడెన్ గార్డెన్స్‌‌లో సన్ రైజర్స్ బ్యాండ్.. కోల్‌కతా జట్టుకు చుక్కలు తప్పవా?

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు నితీష్ రానా జట్టుతో పోరుకు సిద్ధమైంది. స్ట్రాంగ్ టీమ్‌గా కనబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇదే వేదిక మీద చిత్తు చేసిన కోల్‌కతా.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

  • Written By:
  • Updated On - April 14, 2023 / 04:44 PM IST

KKR Vs SRH: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌‌లో శుక్రవారం సాయంత్రం జరగబోయే మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు నితీష్ రానా జట్టుతో పోరుకు సిద్ధమైంది.

స్ట్రాంగ్ టీమ్‌గా కనబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇదే వేదిక మీద చిత్తు చేసిన కోల్‌కతా.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తుంది. మార్కస్ జాన్సన్ రాకతో స్ట్రాంగ్ గా మారిన రైజర్స్ జట్టు, ఐపీఎల్-2023 కి సంబంధించిన ది బెస్ట్ లైనప్‌లలో ఒకటిగా నిలిచింది. మరోవైపు భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫారూఖీ వంటి టాప్ క్లాస్ బౌలర్లతో సన్ రైజర్స్ జట్టు మాంచి జోష్‌లో ఉంది. కోల్‌కతా లైనప్‌ను ఈ బౌలర్ల కూర్పు సరిపోతుంది. వీళ్లకు తోడుగా, మయాంక్ మార్ఖండే కూడా తోడైతే హైదరాబాద్ అద్భుతంగా రాణిస్తుంది. మార్ఖండే రావడం రావడమే తన సత్తా చాటాడు. రషీద్ ఖాన్ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ మార్ఖండే, మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు.

ఈడెన్ గార్డెన్ వంటి స్పిన్ పిచ్ మీద మార్ఖండే మ్యాజిక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాహుల్ త్రిపాటి కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరట కలిగించే విషయం. రైజర్స్ జట్టు ఓపెనింగ్ పెయిర్ ఒక్కటే కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఓపెనర్ల నుంచి ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా ఇప్పటి వరకు నమోదవ్వలేదు. ఐడెన్ మార్క్‌రమ్ అండతో సన్ రైజర్స్ జట్టు ధూమ్ ధామ్ ఆట తీరుతో దూసుకెళ్లాలని చూస్తోంది.