KL RAHUL: కెఎల్ రాహుల్ ఐపీఎల్ ఆడతాడా..? బీసీసీఐ ఏమంటోంది..?

జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జట్టులో రాహుల్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్‌లో భారత జట్టులో చోటు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే సమయంలో రాహుల్ గాయపడటం అతడికి మరింత ప్రతికూలంగా మారింది.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 04:08 PM IST

KL RAHUL: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస గాయాలతో జట్టుకు దూరనవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌ 2023లో గాయపడిన రాహుల్ గతేడాది ఆసియా కప్‌లో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. అనంతరం ఉప్పల్ టెస్టులో మరోసారి గాయపడ్డాడు. అయినప్పటికీ ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపికయ్యాడు.

PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..

90 శాతం ఫిట్‌గా ఉన్నాడని, భారత జట్టుతో చేరతాడని బీసీసీఐ పేర్కొంది. కానీ కట్ చేస్తే.. ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జట్టులో రాహుల్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్‌లో భారత జట్టులో చోటు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే సమయంలో రాహుల్ గాయపడటం అతడికి మరింత ప్రతికూలంగా మారింది. అయితే రాహుల్ గాయంపై, అతని భవిష్యత్‌పై బీసీసీఐ వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. లండన్‌లో అత్యుత్తమ వైద్యనిపుణలతో కేఎల్ రాహుల్ చికిత్స తీసుకుంటున్నాడనీ, త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీకి వస్తాడని తెలిపాయి.

ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చాక ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాయి. అలాగే టీ20 ప్రపంచకప్‌‌కు రాహుల్ వికెట్‌కీపర్-బ్యాటర్‌లా ఎంపికయ్యేలా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడని పేర్కొన్నాయి. ఐపీఎల్‌లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.